అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య | Young Farmer commits suicide | Sakshi
Sakshi News home page

అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య

Aug 27 2015 2:46 PM | Updated on Nov 6 2018 7:56 PM

అప్పుల బాధ తాళలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కనగానపల్లిలో చోటుచేసుకుంది.

కనగానపల్లి (అనంతపురం) : అప్పుల బాధ తాళలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కనగానపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కనగానపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్(29) అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పలు అధికమవడంతో తీర్చే దారి కానరాక వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచరం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement