కానిస్టేబుల్‌ దుస్తులు మార్చుకుంటుండగా చిత్రీకరణ

Yellow Media Video Record At Women Constable Room - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై ఇప్పటికే దుష్ప్రచారం చేస్తున్న పచ్చ మీడియా సంస్థలు మరో సిగ్గుమాలిన చర్యలకు ఒడిగట్టాయి. బరితెగించిన పచ్చ మీడియా చానళ్లు.. మహిళా పోలీసు కానిస్టేబుల్‌పై అసభ్యకరంగా వ్యవహరించాయి. మందడం హైస్కూల్‌లో మహిళా కానిస్టేబుల్‌ దుస్తులు మార్చుకుంటుండగా కనీస మర్యాద పాటించడకుండా వీడియో ద్వారా చిత్రీకరించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విధుల నిమిత్తం మందడంకు వచ్చిన కానిస్టేబుల్‌ డ్యూటీ అనంతరం హైస్కూల్‌లో వారికి కేటాయించిన గదిలోకి వెళ్లారు. దుస్తులు మార్చకుంటుండగా కొన్ని చానళ్ల సిబ్బంది గది కిటికీల నుంచి రహస్యంగా వీడియో రికార్డు చేశారని ఆ కానిస్టేబుల్‌ ఆరోపించారు.

పాఠశాలలో ఖాళీగా ఉన్న రూములను తమకు కేటాయించారని, తమ అనుమతి లేకుండా రూమ్‌లోకి చొరబడి అసభ్యకరంగా వీడియోలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తానని ఆ పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై సంబంధిత పాఠశాల హెడ్‌ మాస్టార్‌ కోటేశ్వరరావు స్పందించారు. పాఠశాలలో ఖాళీగా ఉన్న గదులను మహిళా కానిస్టేబుల్స్‌కు కేటాయించామని, వారిపై ఇలాంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top