యాదవుల నిరసన ర్యాలీ | Yadavas protest rally | Sakshi
Sakshi News home page

యాదవుల నిరసన ర్యాలీ

Apr 18 2018 8:42 AM | Updated on Aug 25 2018 7:16 PM

Yadavas protest rally - Sakshi

కలెక్టరేట్‌ ఎదుట నిరసన ర్యాలీ చేస్తున్న యాదవ సంఘం నాయకులు 

ఏలూరు (వన్‌టౌన్‌) : టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అన్యమత ప్రచారం చేస్తున్నారంటూ ప్రచారం చేస్తుండడం దారుణమని, అది పూర్తిగా అసత్యమని యాదవ సంఘం నేతలు స్పష్టం చేశారు.

సుధాకర్‌యాదవ్‌పై అసత్య ప్రచారాన్ని నిరసిస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన ర్యాలీ చేశారు. స్థానిక ఫైర్‌స్టేషన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు యాదవులు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా నగర యాదవ సంఘం కన్వీనర్‌ మల్లిపూడి రాజు ఆధ్వర్యంలో యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘం నాయకులు ఊక్కుసూరి గోపాలకృష్ణ, మల్లిపూడి రాజు, కీలరపు జగదీష్, కీలారు బుజ్జి, తలారి గోపి యాదవ, పిలకల ప్రకాశరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement