3,4 తేదీలలో జగన్ 'పశ్చిమ' పర్యటన | Y S Jagan mohan reddy tour in west godavari district | Sakshi
Sakshi News home page

3,4 తేదీలలో జగన్ 'పశ్చిమ' పర్యటన

Feb 28 2014 12:25 PM | Updated on Aug 27 2018 8:57 PM

3,4 తేదీలలో జగన్ 'పశ్చిమ' పర్యటన - Sakshi

3,4 తేదీలలో జగన్ 'పశ్చిమ' పర్యటన

వచ్చే నెల 3, 4 తేదీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ నాయకులు డా.తోట చంద్రశేఖర్, ఆళ్ల నానిలు తెలిపారు.

వచ్చే నెల 3, 4 తేదీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తారని ఆ పార్టీ నాయకులు డా.తోట చంద్రశేఖర్, ఆళ్ల నానిలు తెలిపారు. వచ్చే 3వ తేదీన ఏలూరులోని అల్లూరి సీతారామరాజు (ఏఎస్ఆర్) స్టేడియంలో ఆయన ఎన్నికల శంఖారావ సభలో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియంలో ఏర్పాట్లను వారు పరిశీలించారు.

 

అనంతరం డా.తోట చంద్రశేఖర్, ఆళ్ల నానిలు మీడియాతో మాట్లాడుతూ... 3వ తేదీ మధ్యాహ్నం వైఎస్ జగన్ గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగుతారని, అనంతరం ఎయిర్పోర్ట్ నుంచి ఏలూరు వరకు ఆయన రోడ్డు షో నిర్వహిస్తారన్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం 4 గంటలకు ఎఎస్ఆర్ స్టేడియంలో ఎన్నికల శంఖారావం సభలో ప్రసంగిస్తారని తెలిపారు.  4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నిడదవోలులో ఎన్నికల శంఖారావ సభ నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement