
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పులివెందులకు రానున్నారు.
పులివెందుల, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పులివెందులకు రానున్నారు. ఈ మేరకు మూడు రోజుల పర్యటన ఖరారైందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగ ం నాయకుడు, పులివెందుల సమన్వయకర్త వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. సోమవారం పులివెందులకు చేరుకున్న అనంతరం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటారు.
24వ తేదీన ఉదయం ఇడుపులపాయలో కుటుంబ సభ్యులు, బంధువులతో గడపనున్నారు. అదేరోజు మధ్యాహ్నం పులివెందుల - సింహాద్రిపురం రహదారి ప్రక్కన నక్కలపల్లె సమీపంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, భద్రంపల్లె సుదర్శన్‌రెడ్డిలు నిర్మించిన రైతు గోదామును వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. తర్వాత పులివెందులకు చేరుకొని ప్రజలతో మమేకమవుతారు. 25వ తేదీన క్రిస్మస్ వేడుకలలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్చికి వెళ్లనున్నారు. తర్వాత ప్రజలకు కార్యాలయంలో అందుబాటులో ఉంటారని ఆయన వివరించారు.