కార్మికుల తోపులాట, పరిస్థితి ఉద్రిక్తం | workers dharna at Deccan Ferro allayis in vijayanagaram district | Sakshi
Sakshi News home page

కార్మికుల తోపులాట, పరిస్థితి ఉద్రిక్తం

Apr 13 2016 1:38 PM | Updated on Sep 3 2017 9:51 PM

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం డెక్కన్ ఫెర్రో అల్లాయిస్ కర్మాగారం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

విజయనగరం: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం డెక్కన్ ఫెర్రో అల్లాయిస్ కర్మాగారం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కర్మాగారం యాజమాన్యం ఇటీవల కొందరు ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించింది. దీంతో తొలగింపునకు గురైన వారు పనిలోకి వెళ్తున్న కొత్తవారిని బుధవారం ఉదయం అడ్డుకున్నారు. దీంతో అక్కడ రెండువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement