అడవికొలనులో ఆమెకు ఒక్కరోజు

Womens Special Shopping in Srirama Navami Festival - Sakshi

మహిళలకు ప్రత్యేకంగా తీర్థం   శ్రీరామనవమి ఉత్సవాల్లో ఆచారం  

పశ్చిమగోదావరి, నిడమర్రు: అడవికొలను గ్రామంలో ప్రతి శ్రీరామనవమికి ఓ  ఆచారం ఆనవాయితీగా వస్తోంది. ఈ గ్రామంలోని మహిళలకు ఈ ఒక్కరోజు పురుషులు పూర్తి స్వేచ్ఛనిస్తారట. మహిళలు తమకు నచ్చినట్టు విహరించేందుకు, తీర్థంలో నచ్చినవి కొనుక్కునేందుకు అవకాశం కల్పిస్తారట. ఇది పూర్వ నుంచి వస్తున్న ఆచారమట. అన్నట్టు తీర్థంలోకి మహిళలకు మాత్రమే ప్రవేశమట. ఈ తీర్థం ఆదివారం గ్రామంలో జరిగింది. రాముని రథోత్సవం అనంతరం మహిళలకు ప్రత్యేకం తీర్థం నిర్వహించారు. ఈ తీర్థంలో మహిళలకు అవసరమైన అన్ని వస్తువులనూ అందుబాటులో ఉంచారు. దుస్తులు, ఫ్యాన్సీ, సౌందర్య వస్తువుల స్టాళ్లూ పెట్టారు. దీంతో తీర్థంలో మహిళలు సందడి చేశారు. ఈ గ్రామం ఏర్పడిన నాటి నుంచి ఈ ఆచారం వస్తున్నట్టు ఉత్సవకమిటీ అధ్యక్షుడు పోశింశెట్టి రామమూర్తి తెలిపారు. కడప జిల్లా పులివెందుల, అడవికొలను గ్రామంలో మాత్రమే ఈ ఆచారం ఉన్నట్టు చెబుతున్నారు. అర్ధరాత్రి 2 గంటల వరుకూ మహిళలకు తీర్థంలో అవకాశం కల్పిస్తారని, అక్కడి నుంచి పురుషులు తీర్థంలో పాల్గొంటారని వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top