గెస్ట్‌హౌజ్‌కి వెళ్లి ఉద్యోగం ఎలా చేయాలి? | Women Employees Faces Problem To Work In Peddapuram R And B Guest House | Sakshi
Sakshi News home page

చినరాజప్ప ఇలాఖాలో.. మహిళా ఉద్యోగుల ఆవేదన

Feb 9 2019 1:07 PM | Updated on Feb 9 2019 1:13 PM

Women Employees Faces Problem To Work In Peddapuram R And B Guest House - Sakshi

సరైన సదుపాయాలు లేకపోవడంతో మంచాలు, సోఫాలపై కాలక్షేపం చేస్తున్న ఉద్యోగులు

సాక్షి, కాకినాడ/తూర్పు గోదావరి : ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఇలాఖాలో ఆర్‌ అండ్‌ బీ ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. పెద్దాపురం గెస్ట్‌హౌజ్‌లో విధులు నిర్వహిస్తున్న ఆర్‌ అండ్‌ బీ డివిజన్‌ ఉద్యోగులు సరైన సదుపాయాలు లేకపోవడంతో మంచాలు, సోఫాలపై కాలక్షేపం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మౌలిక సదుపాయాల లేమితో మహిళా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది సెలవులో వెళ్లిపోగా..  గెస్ట్‌హౌజ్‌లో ఎలా ఉద్యోగం చేయాలంటూ విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా పెద్దాపురంలో ఆర్‌ అండ్‌ బీ డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ గతేడాది డిసెంబరు 20న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అక్కడి గెస్ట్‌హౌజ్‌లోనే విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ 30 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. బదిలీ కోసం ఎదురుచూస్తున్న ఈఈ సత్యనారాయణ వల్లే గెస్ట్‌హౌజ్‌లో పనిచేయాల్సి వచ్చిందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement