ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్..మహిళ మృతి | women died in tractor accident at guntur district | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్..మహిళ మృతి

Jan 11 2016 9:14 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని మహానాడు కాలనీలో విషాదం చోటు చేసుకుంది.

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని మహానాడు కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంట సమయంలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న లలిత కుమారి(32) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా..మరో చిన్నారికి గాయాలయ్యాయి. గాయపడిన చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరు రాజస్తాన్ నుంచి 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడినట్లు తెలిసింది. 

Advertisement
 
Advertisement
Advertisement