భోగి వేడుకలో ఘర్షణ, మహిళ మృతి | women died in bhogi festival in nellore district | Sakshi
Sakshi News home page

భోగి వేడుకలో ఘర్షణ, మహిళ మృతి

Jan 14 2015 8:18 AM | Updated on Oct 20 2018 6:19 PM

భోగి మంటల సంబరం ఓ మహిళ మృతికి దారి తీసింది.

నెల్లూరు: భోగి మంటల సంబరం ఓ మహిళ మృతికి దారి తీసింది. తడ మండలం తడ కండ్రిగలో భోగి మంటల వేడుకలో మహిళల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అది కాస్తా తీవ్రరూపం దాల్చింది. దాంతో మహిళల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో మనెమ్మ అనే మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

Advertisement
 
Advertisement
Advertisement