మద్యం షాపు ఏర్పాటును అడ్డుకున్న మహిళలు | woman protests in front of wine shop at samarlakota | Sakshi
Sakshi News home page

మద్యం షాపు ఏర్పాటును అడ్డుకున్న మహిళలు

Jan 31 2016 1:48 PM | Updated on Sep 3 2017 4:42 PM

తూర్పుగోదావరి జిల్లాలో మద్యం షాపు షాపు ఏర్పాటును నిరసిస్తూ స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు.

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లాలో మద్యం షాపు ఏర్పాటును నిరసిస్తూ స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. సామర్లకోట విఘ్నేశ్వర థియేటర్ సమీపంలో మద్యం షాపు ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

నివాసాల మధ్య, మార్కెట్ సమీపంలో షాపు ఏర్పాటు చేయవద్దని టెంట్ వేసుకుని మహిళలు అక్కడే కూర్చోని నినాదాలు చేస్తున్నారు. కాగా, మద్యం షాపు ఏర్పాటుకు తమకు లైసైన్స్ ఉందని షాపు యజమానులు చెబుతున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement