కావలిలో గత అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. కొండమ్మ అనే మహిళను మరో మహిళ అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపింది.
నెల్లూరు జిల్లా కావలిలో గత అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. కొండమ్మ అనే మహిళను మరో మహిళ అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపింది. దీంతో కొండమ్మ కుటుంబసభ్యులు శనివారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని
మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోస్ట్మార్టం నిమిత్తం ఆ మృతదేహన్ని పోలీసులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని స్థానికులు పోలీసులకు తెలిపారు.