అప్పుల బాధతో మహిళారైతు ఆత్మహత్య | woman farmer suicide with debts sadness | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో మహిళారైతు ఆత్మహత్య

Dec 29 2013 11:52 PM | Updated on Nov 6 2018 7:53 PM

అప్పుల బాధతో మహిళారైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంట మండల పరిదిలోని పోతాన్‌పల్లి గ్రామంలో అదివారం రాత్రి చోటుచేసుకుంది.

చేగుంట, న్యూస్‌లైన్: అప్పుల బాధతో మహిళారైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చేగుంట మండల పరిదిలోని పోతాన్‌పల్లి గ్రామంలో అది వారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తిరుపతి శ్యామల, భర్త అంజనేయు లు వారికి ఉన్న ఎకరా పొలంలో వ్యవసాయం చేస్తు జీవనం సాగిస్తున్నారు. ఇటీవల తన వ్యవసాయ భూమిలో బోరుబావిని తవ్వించారు. దానికొసం కొంత అప్పు చేశారు. అప్పులు తీర్చే విషయంలో మనస్థాపం చెందిన శ్యామల(35) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై వినాయక్‌రెడ్డి గ్రామానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమెదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఎరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement