కలకలం రేపుతున్న లేడీ డాక్టర్‌ ఆత్మహత్య! | Woman doctor allegedly commits suicide in vijayawada | Sakshi
Sakshi News home page

కలకలం రేపుతున్న లేడీ డాక్టర్‌ ఆత్మహత్య!

Jun 10 2017 10:19 AM | Updated on Sep 5 2017 1:17 PM

కలకలం రేపుతున్న లేడీ డాక్టర్‌ ఆత్మహత్య!

కలకలం రేపుతున్న లేడీ డాక్టర్‌ ఆత్మహత్య!

ఓ మహిళా వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన విజయవాడ అశోక్‌నగర్‌లో వెలుగుచూసింది.

విజయవాడ: ఓ మహిళా వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన విజయవాడ అశోక్‌నగర్‌లో  వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న లేడీ డాక్టర్‌ సుష్మ అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

భర్త సునీల్‌ వేధింపుల వల్లే  సుష్మ మృతి చెందిందని, భర్త హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు వైద్యురాలి భర్తను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. వీరికి ఏడేళ్ల పాప ఉంది.

ఈ ఘటనపై సుష్మ కుటుంబీకులు తరఫు న్యాయవాది మాట్లాడుతూ... ప్రాథమిక ఆధారాల ప్రకారం సుష్మది కచ్చితంగా హత్యేనని, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మృతురాలి ఒంటిమీద కూడా గాయాలు ఉన్నాయని తెలిపారు. మృతురాలి తల్లి గీత మాట్లాడుతూ... తన కుమార్తె చనిపోయేంత పిరికిది కాదని అన్నారు.

భర్త వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తూ సుష్మ మృతదేహంతో ఆందోళనకు దిగారు. సునీల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  రెండు రోజులు గడిచినా కుటుంబసభ్యులు సుష్మ అంత్యక్రియలు చేయలేదు.  అయితే పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మాట్లాడతామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement