వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో భక్తురాలి మృతి | woman dies due to heart attack | Sakshi
Sakshi News home page

వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో భక్తురాలి మృతి

May 12 2015 5:20 PM | Updated on Sep 3 2017 1:54 AM

ఏడుకొండలవాడిని చూద్దామనుకున్న ఆ భక్తురాలి ఆశ ఫలించలేదు.

తిరుమల : ఏడుకొండలవాడిని చూద్దామనుకున్న ఆ భక్తురాలి ఆశ ఫలించలేదు. దర్శనం కోసం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండగానే ఆమె ప్రాణాలు పోయాయి. వివరాల్లోకి వెళ్తే... మంగళవారం సాయంత్రం తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో స్వామి దర్శనం కోసం వేచి ఉన్న భక్తురాలు బర్షన్ కౌర్ (54) గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలు మహారాష్ట్రలోని పూణె పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనతో బర్షన్‌కౌర్ కుటుంబసభ్యుల్లో విషాదం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement