ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి | Woman died by hitting RTC bus at Bheemavaram | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

Apr 29 2015 4:15 PM | Updated on Sep 3 2017 1:07 AM

వేగంగా వస్తున్న బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది.

పశ్చిమగోదావరి(భీమవరం): వేగంగా వస్తున్న బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఫ్లై ఓవర్ బ్రిడ్జీపై బుధవారం జరిగింది. పట్టణానికి చెందిన నేతుల రాణి(30) అనే మహిళ స్కూటీపై బ్యూటీ పార్లల్‌కు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

దీంతో రాణి అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement