మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూత | woman cartoonist ragati pandari passes away | Sakshi
Sakshi News home page

మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూత

Feb 19 2015 5:01 PM | Updated on Jul 31 2018 5:31 PM

మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూత - Sakshi

మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి కన్నుమూత

ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు

విశాఖ: ప్రముఖ మహిళా కార్టూనిస్ట్ రాగతి పండరి(50) గురువారం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న  ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. సావిత్రిబాయ్ పూలే మోమోరియల్ ట్రస్ట్ ద్వారా రాగతి కుటుంబ సభ్యులు ఆమె అవయవాల్ని దానం చేశారు.
 

కార్టూనిస్ట్ గా రాశిలోనూ, వాసిలోనూ సమానమైన కీర్తి ప్రతిష్టలను ఆర్జించుకున్న ఏకైక మహిళ ఆమె. అనతి కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో చాలా మంచి పేరు తెచ్చుకుని, ఆ రంగంలో అగ్రగణ్యులైన బాపు, జయదేవ్, బాబు ల సరసన నిలబడగలిగిన స్థాయి చేరుకున్నది. దురదృష్టవశాత్తూ, ఈమెకు చిన్నతంలో వచ్చిన పోలియో మూలంగా శారీరకంగా చలాకీగా తిరగలేకపోయేది. అయినా మానసికంగా ఆమె ధృడంగా ఉండటంతో పలురకాల కార్టూన్లు గీసి కీర్తిని ఆర్జించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement