రుణమాఫీపై ప్రభుత్వంతో పోరాడతాం | will fight with government for loan waiver, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై ప్రభుత్వంతో పోరాడతాం

Aug 10 2014 1:24 AM | Updated on Jul 25 2018 4:09 PM

రుణమాఫీపై ప్రభుత్వంతో పోరాడతాం - Sakshi

రుణమాఫీపై ప్రభుత్వంతో పోరాడతాం

రుణమాఫీ అమలు జరిగేంతవరకు ప్రభుత్వంతో పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు భరో సా ఇచ్చారు

నెల్లూరు పర్యటనలో రైతులకు జగన్ భరోసా

నెల్లూరు: రుణమాఫీ అమలు జరిగేంతవరకు ప్రభుత్వంతో పోరాటం చేస్తామని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు భరో సా ఇచ్చారు. ఆయన శనివారం నెల్లూరులో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోదరుడి కుమార్తె వివాహానికి జగన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు, నెల్లూరుపాలెం, సంగంలలో పార్టీశ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. చంద్రబాబు రుణమాఫీ హామీ తుంగలోతొక్కి రైతులను నట్టేట ముంచారని రైతులు జగన్ దృష్టికితెచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement