'కిరణ్ ఊర్లో వెబ్ కెమెరాల ద్వారా నిఘాపెట్టాలి' | Web cameras should use in Kiran Kumar Reddy's Village | Sakshi
Sakshi News home page

'కిరణ్ ఊర్లో వెబ్ కెమెరాల ద్వారా నిఘాపెట్టాలి'

May 6 2014 7:08 PM | Updated on Jul 29 2019 5:31 PM

'కిరణ్ ఊర్లో వెబ్ కెమెరాల ద్వారా నిఘాపెట్టాలి' - Sakshi

'కిరణ్ ఊర్లో వెబ్ కెమెరాల ద్వారా నిఘాపెట్టాలి'

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై దృష్టి సారించాలని ఎన్నికల కమిషన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.

చిత్తూరు: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో పోలింగ్ సరళిపై దృష్టి సారించాలని ఎన్నికల కమిషన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.
 
కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం, గ్రామంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాలని ఎన్నికల అధికారులకు రాజంపేట వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, పీలేరు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిలు కోరారు.
 
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగే అవకాశముందని,  వెబ్ కెమెరాల ద్వారా పొలింగ్ సరళి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను మిథున్ రెడ్డి, రామచంద్రారెడ్డిలు కోరారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement