నిమిషం ఆలస్యమైనా అనుమతించం: కలెక్టర్ | we wont allow students lately to exam hall : collector | Sakshi
Sakshi News home page

నిమిషం ఆలస్యమైనా అనుమతించం: కలెక్టర్

Feb 1 2014 11:41 PM | Updated on Mar 28 2018 10:59 AM

గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ ఏ) పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసిం ది. ఆదివారం జిల్లావ్యాప్తంగా 107 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు సుమారు 64వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
 గ్రామ రెవెన్యూ అధికారులు(వీఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ ఏ) పరీక్షలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసిం ది. ఆదివారం జిల్లావ్యాప్తంగా 107 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు సుమారు 64వేల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్య లు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ తెలి పారు. వీఆర్‌ఓకు 59,385 మంది, వీఆర్‌ఏ పోస్టులకు 5,176 మంది పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. మొత్తం 44 రూట్లను ఏర్పాటు చేశామని, 20 మంది పరిశీలకులు, 10 స్పెషల్ స్క్వాడ్‌లు, 107 మంది అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు 144 సెక్షన్‌ను విధించినట్లు తెలిపారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అదనపు బస్సులను నడుపుతున్నట్లు, నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని పేర్కొన్నా రు. పరీక్షల్లో కాపీయింగ్‌ను నిరోధించేం దుకు వీలుగా సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసేయాలని ఆదేశించినట్లు కలెక్టర్ చెప్పారు.
 
 ఉదయం 10 గంటలకు జరిగే వీఆర్‌ఓ పరీక్షకు 59,385 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
 మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే వీఆర్‌ఏ పరీక్షకు 5,176 మంది హాజరుకానున్నారు.
 అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి గంట ముందు చేరుకోవాలి.పరీక్ష ప్రారంభమైన తర్వాత కేంద్రాల్లోకి అనుమతించరు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement