'ప్రకాశంలో ఫ్లోరైడ్ నివారణకు నిధులు' | we will provide funds to prakasam district for fluoride, says siddha raghavarao | Sakshi
Sakshi News home page

'ప్రకాశంలో ఫ్లోరైడ్ నివారణకు నిధులు'

Sep 29 2015 4:38 PM | Updated on Sep 3 2017 10:11 AM

'ప్రకాశంలో ఫ్లోరైడ్ నివారణకు నిధులు'

'ప్రకాశంలో ఫ్లోరైడ్ నివారణకు నిధులు'

ప్రకాశం జిల్లాను ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శిద్ధా రాఘవరావు ఆదేశించారు.

ఒంగోలు టౌన్ : ప్రకాశం జిల్లాను ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి శిద్ధా రాఘవరావు ఆదేశించారు. బుధవారం ఒంగోలులో ఫ్లోరైడ్‌ అంశంపై వైద్య ఆరోగ్యశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు పెద్ద సంఖ్యలో పెరిగిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

దీన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. అందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని మంత్రి రాఘవరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement