గాంధీ గురించి మనకెందుకు: మంత్రి వ్యాఖ్యలు | We Dont Want About Gandhi Says Ayyanna Patrudu | Sakshi
Sakshi News home page

గాంధీ గురించి మనకెందుకు: మంత్రి వ్యాఖ్యలు

Dec 16 2018 4:45 PM | Updated on Dec 16 2018 5:21 PM

We Dont Want About Gandhi Says Ayyanna Patrudu - Sakshi

సాక్షి, గుంటూరు : జాతిపిత మహాత్మా గాంధీపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి అయ్యన్న పాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చాలా మంది రాజకీయ నేతలు గాంధీ, అబ్దుల్‌ కలాం, ఎన్టీఆర్‌ వంటి నేతలు తమకు ఆదర్శమని అంటుంటారని, అసలు గాంధీ గురించి మనకెందుకు? అంటూ నోరుజారారు. ఆదర్శం అనే పదానికి అర్థం లేకుండా పోయిందని, యడ్లపాటి వెంకట్రావే మనందరికీ అదర్శమని ఆయన అన్నారు.

ఆదివారం ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై సభలో ఉన్నవారంతా ఒక్కింత విస్మయానికి గురైయ్యారు. మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి గాంధీని చులకనగా చేసి మాట్లాడటం  ఏంటని అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement