తెలంగాణలో భాగంగా ఉన్న హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
హుజూర్‌నగర్, న్యూస్‌లైన్
తెలంగాణలో భాగంగా ఉన్న హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఊరుకునేది లేదని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్ధాల కాలంగా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు అనేక ఉద్యమాలు, ఆత్మబలిదానాలు చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వెలువడిందన్నారు. హైదరాబాద్‌లోని సంపదను ఇన్ని రోజుల పాటు కొల్లగొట్టిన సీమాం ధ్రులు ఇంకా కొల్లగొట్టడానికే కుట్రలు పన్నుతున్నారన్నారు. సీమాం ధ్రలో జరుగుతున్న ఉద్యమం రాజకీయ పోరాటం మాత్రమే అన్నారు.
ప్రజల ద్వారా వచ్చింది కాదన్నారు. హైదరాబాద్ రాజధానిగా ఉన్న తెలంగాణను మాత్రమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం స్వార్ధ ప్రయోజనాల కోసం చూడకుండా వెంటనే తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేసి పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి ఒకే ప్రాంతానికి కొమ్ము కాయడం సరికాదన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నేటికీ పరిహారం అందించలేదన్నారు. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, కోడిమల్లయ్యయాదవ్, జాల గురవయ్య, తిరుపతి వెంకయ్య, అన్నెపంగు రామయ్య తదితరులు పాల్గొన్నారు.