సైకిళ్లిస్తున్నాం..సైకిల్‌కే ఓటేయించండి | We are giving cycles..vote to the cycle | Sakshi
Sakshi News home page

సైకిళ్లిస్తున్నాం..సైకిల్‌కే ఓటేయించండి

Apr 18 2017 1:14 AM | Updated on Aug 14 2018 11:26 AM

తొమ్మిదో తరగతి చదివే బాలికలందరికీ సైకిళ్లిస్తున్నామని, అందరూ సైకిల్‌కే ఓటేయించాలని సీఎం చంద్రబాబు విద్యార్థినులను కోరారు.

బాలికలను కోరిన సీఎం

సాక్షి, అమరావతి: తొమ్మిదో తరగతి చదివే బాలికలందరికీ సైకిళ్లిస్తున్నామని, అందరూ సైకిల్‌కే ఓటేయించాలని సీఎం చంద్రబాబు విద్యార్థినులను కోరారు. మీ అమ్మానాన్నలు, మీ చుట్టుపక్కల వాళ్లతో చెప్పి ఓట్లేయించి మళ్లీ తమనే గెలిపించాలన్నారు. సోమవారం విజయవాడలోని ఒక ఫంక్షన్‌ హాలులో ‘బడికొస్తా’ పేరుతో తొమ్మిదో తరగతి బాలికలకు సైకిళ్లు పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సైకిల్‌ తొక్కితే ఆరోగ్యం బాగుంటుందని, అలాగే సైకిల్‌కి ఓటేస్తేనే అందరి ఆరోగ్యం బాగుంటుందన్నారు. బడి పిల్లల సభలోనూ బాబు ఓట్ల గురించి మాట్లాడడంతో అంతా విస్తుపోయారు. ఉచితంగా సైకిల్‌ ఇచ్చామని దాన్ని కచ్చితంగా బాలికలే వినియోగించాలని చంద్రబాబు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement