పీతల సుజాత తండ్రిని కూడా విచారించాం: ఎస్పీ | we are enquiry the peethala sujatha's father says superintendent of police | Sakshi
Sakshi News home page

పీతల సుజాత తండ్రిని కూడా విచారించాం: ఎస్పీ

Jun 3 2015 10:40 AM | Updated on Nov 6 2018 8:50 PM

పీతల సుజాత తండ్రిని కూడా విచారించాం: ఎస్పీ - Sakshi

పీతల సుజాత తండ్రిని కూడా విచారించాం: ఎస్పీ

బ్యాగ్లో నోట్ల కట్టల వ్యవహారంలో మంత్రి పీతల సుజాత తండ్రిని కూడా విచారణ జరిపినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భూషణ్ తెలిపారు.

ఏలూరు : బ్యాగ్లో నోట్ల కట్టల వ్యవహారంలో మంత్రి పీతల సుజాత తండ్రిని కూడా విచారణ జరిపినట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తెలిపారు. రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఆయన బుధవారమిక్కడ చెప్పారు. నిన్న రాత్రి ఈ ఘటన జరిగిందని, పీతల సుజాత హౌస్ కీపర్ చిల్లి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. 102 సీఆర్పీ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు. బ్యాగ్లో రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయని ఎస్పీ పేర్కొన్నారు.

కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ వ్యవహారంలో పోలీస్ శాఖపై ఎటువంటి ఒత్తిడి లేదని, నరసాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. ప్రాధమిక దర్యాప్తు ప్రకారం పాలకొల్లు ఎస్బీఐ బ్యాంకు నుంచి మంగళవారం నగదు డ్రా చేసినట్టు భూషణ్ తెలిపారు. రూ. 10 లక్షల నగదు లావాదేవీపై ఆదాయపన్నున శాఖ సాయం కూడా తీసుకుంటామన్నారు. అద్దాల విష్టువతి, శ్రీలక్ష్మీని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement