నీళ్ల తొట్టిలో పడి పసికందు మృత్యువాత | Water, and the babe lying in the manger death | Sakshi
Sakshi News home page

నీళ్ల తొట్టిలో పడి పసికందు మృత్యువాత

Jun 23 2014 1:37 AM | Updated on Sep 2 2017 9:13 AM

మండలంలోని ఆరుగొలనుపేట గ్రా మానికి చెందిన విజయ్‌కిరణ్(13 నెలలు) ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న నీటి వరల తొట్టిలో పడి మృతిచెందాడు.

చాట్రాయి : మండలంలోని ఆరుగొలనుపేట గ్రా మానికి చెందిన విజయ్‌కిరణ్(13 నెలలు) ఆడుకుంటూ ఇంటి సమీపంలో ఉన్న నీటి వరల తొట్టిలో పడి మృతిచెందాడు. ఆదివారం మధ్యాహ్నం  జరిగిన ఈ ఘటనతో తండ్రి కొ మ్మి పోచయ్య, తల్లి దుర్గ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కుమారుడి మృతదేహాన్ని ఒడి లో పెట్టుకుని తల్లి దుర్గ రోదిస్తుండటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. బుడి బుడి నడకలతో చిరునవ్వులు చిందిస్తూ కొద్దిసేపటి ముందు వరకు తమ కళ్ల ముందు తిరిగిన విజ య్‌కిరణ్ అకాల మరణంతో కాలనీ వాసులు తీవ్ర విషాదానికి లోనయ్యారు. మృతుడి కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అప్పిరెడ్డి, గ్రామ సర్పంచ్ పద్మ తదితరులు పరామర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement