నీటిపారుదలశాఖ గుంటూరు సర్కిల్ ఎస్‌ఈగా కొనసాగుతున్న వీఎస్ రమేష్‌బాబు కృష్ణాడెల్టా చీఫ్ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు.
విజయవాడ: నీటిపారుదలశాఖ గుంటూరు సర్కిల్ ఎస్‌ఈగా కొనసాగుతున్న వీఎస్ రమేష్‌బాబు కృష్ణాడెల్టా చీఫ్ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. సీఈగా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాంబయ్య ఉద్యోగ విరమణ చేయడంతో రమేష్‌బాబును సీఈగా నియమిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబరు 380 విడుదల చేసింది. కిందటేడాదే ఉద్యోగ విరమణ చేసిన సాంబయ్యను ప్రభుత్వం 6 నెలల చొప్పున రెండుసార్లు బాధ్యతల్ని పొడిగించింది. పొడిగించిన గడువు కూడా పూర్తి కావడంతో ఆయన సోమవారం ఉద్యోగ విరమణ చేశారు.