breaking news
Krishna Delta Chief Engineer
-
'ప్రమాదం అంచున విజయవాడ' వార్తకు స్పందన
హైదరాబాద్: సాక్షి టీవీలో 'ప్రమాదం అంచున విజయవాడ' అని ప్రకాశం బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు పై ప్రసారం చేసిన కథనానికి కృష్ణాడెల్టా చీఫ్ ఇంజనీర్ స్పందించారు. కృష్ణా నదిపై విజయవాడలో నిర్మించిన ప్రకాశం బ్యారేజీకి ప్రాణంగా భావించే 70 క్రస్ట్ గేట్లు తుప్పు పట్టాయి. ఈ అంశంపై బ్యారేజీ నిర్వహణ కమిటీ ఈరోజు నివేదిక ఇస్తుందని చీఫ్ ఇంజనీర్ తెలిపారు. బ్యారేజీ 70 గేట్లను మరమ్మతు చేయిస్తామని ఆయన చెప్పారు. నిపుణుల సిఫారసు మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. -
కృష్ణాడెల్టా చీఫ్ ఇంజినీర్‌గా రమేష్‌బాబు
విజయవాడ: నీటిపారుదలశాఖ గుంటూరు సర్కిల్ ఎస్ఈగా కొనసాగుతున్న వీఎస్ రమేష్‌బాబు కృష్ణాడెల్టా చీఫ్ ఇంజినీర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. సీఈగా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సాంబయ్య ఉద్యోగ విరమణ చేయడంతో రమేష్‌బాబును సీఈగా నియమిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబరు 380 విడుదల చేసింది. కిందటేడాదే ఉద్యోగ విరమణ చేసిన సాంబయ్యను ప్రభుత్వం 6 నెలల చొప్పున రెండుసార్లు బాధ్యతల్ని పొడిగించింది. పొడిగించిన గడువు కూడా పూర్తి కావడంతో ఆయన సోమవారం ఉద్యోగ విరమణ చేశారు.