గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను ఈ నెల 22వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది.
22న వీఆర్‌వో, వీఆర్‌ఏ ఫలితాలు
Feb 20 2014 2:02 AM | Updated on Sep 2 2017 3:52 AM
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలను ఈ నెల 22వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది. 1,657 వీఆర్‌వో, 4,305 వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి ఈ నెల రెండో తేదీ జరిగిన రాత పరీక్షలకు 12,72,843 మంది హాజరయ్యారు. వీటికి సంబంధించిన ఫైనల్ ‘కీ’ పదో తేదీన విడుదల చేసిన ఏపీపీఎస్సీ 20వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని మొదట పేర్కొంది. అయితే కొన్ని జిల్లాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తికానందున ఫలితాల విడుదల రెండు రోజులు జాప్యం కానుందని రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనరేట్ అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement