వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి | VRO,VRA, examinations arrangements Complete | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఓ, వీఆర్‌ఏ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

Jan 30 2014 1:37 AM | Updated on Aug 20 2018 4:27 PM

జిల్లాలో ఆదివారం జరిగే వీఆర్‌ఓ, వీఆర్ ఏ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా 168కేం ద్రా ల్లో

విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఆదివారం జరిగే వీఆర్‌ఓ, వీఆర్ ఏ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా 168కేం ద్రా ల్లో ఈ పరీక్షలు జరగనున్నారుు. జిల్లాలో 90వీఆర్‌ఓ, 137వీఆర్‌ఏ పోస్టులకు సం బంధించి నోటిఫికేషన్ జారీ చేసిన విష యం విధితమే. అయితే అర్హత గల అభ్యర్థులు లేకపోవడంతో 27 వీఆర్‌ఓ పోస్టుల కు దరఖాస్తులు రాలేదు. రిజర్వ్ అయిన పోస్టులను పక్కన పెడితే మిగిలిన పోస్టు ల్లో ఒక్కొక్క పోస్టుకు 515 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రశ్నపత్రాలను అధికారులు ఖజానా కార్యాలయంలో భద్రపరిచారు. 
 
 వీఆర్‌ఓ పరీక్షకు సంబంధించి 44,223 మంది, వీఆర్‌ఏ పరీక్షకు సంబంధించి 2008 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. పరీక్షలకు చీఫ్ సూపరెంటెం డెంట్లుగా 168 మంది, సహాయ అధికారులుగా మరో 168మందిని నియమించా రు. వారితో పాటు 35మంది తహశీల్దా ర్లు, ఎంపీడీఓలు లైజన్ అధికారులుగా ఉంటారు. అలాగే మరో 22మందిని ప్ర త్యేకాధికారులుగా నియమించారు. వారి తో పాటు 14 మంది జిల్లాస్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమిస్తూ... కలెక్టర్ కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతికేంద్రంలోనూ వీడియో చిత్రీకరించ నున్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు శిక్షణ కూడా పూర్తి చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement