ఆ విషయంలో జగన్‌కు బీజేపీ సహకరిస్తుంది : విష్ణువర్ధన్‌ రెడ్డి

Vishnu Vardhan Reddy, Who Demanded That YS Jagan Inquire Into the Past Government Corruption - Sakshi

సాక్షి: రాష్ట్రంలో గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ చేయిస్తామన్న ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఉద్దేశాన్ని తాము స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి తెలిపారు.  చంద్రబాబు ప్రభుత్వం లక్షా 62వేల కోట్ల అవినీతికి పాల్పడిందని పుస్తకాలు ప్రచురించి వాడవాడలా పంచి పెట్టిన జగన్‌, వాటిపై ఇప్పుడు ఎటాంటి విచారణ చేపట్టినా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. అయితే అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా ఆ దిశగా ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో 14 శాతం తక్కువకు చేపట్టిన టెండర్లను రద్దుచేసి రీ టెండరింగ్‌ చేపడతామంటున్నారు. అలాగైనా గడుకులోపు ప్రాజెక్టు పూర్తి చేయకుంటే బీజేపీ ప్రశ్నిస్తుందన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top