అందరూ చూస్తుండగానే కత్తిపోట్లు | Villain Artist Stabbed Young man in Banjara Hills | Sakshi
Sakshi News home page

అందరూ చూస్తుండగానే కత్తిపోట్లు

Mar 17 2014 3:50 PM | Updated on Sep 4 2018 5:07 PM

కత్తిపోట్లకు గురైన ఫయాజ్ (ఫైల్ ఫోటో) - Sakshi

కత్తిపోట్లకు గురైన ఫయాజ్ (ఫైల్ ఫోటో)

పట్టపగలు ఓ యువకుడు కత్తిపోట్లకు గురై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు. అందరు చూస్తుండగానే జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది.

హైదరాబాద్: పట్టపగలు ఓ యువకుడు కత్తిపోట్లకు గురై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడాడు. అందరు చూస్తుండగానే జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. హుమాయున్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం... చింతల్‌బస్తీ ప్రేమ్‌నగర్‌లో నివసించే రవూఫ్ కుమారుడు ఫయాజ్ (25) బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తున్నాడు.

ఆయన వదిన షీమా నవాజ్‌కు బంజారాహిల్స్ రేషంబాగ్‌లో ఇల్లు ఉంది. ఆ ఇంట్లో అబ్దుల్ రహమాన్ అలియాస్ బాబా అద్దెకు ఉంటున్నాడు. ఇతనిని ఏడాదిగా ఖాళీ చేయాలని షీమా కోరుతోంది. వినకపోవడంతో మరిది ఫజాయ్‌కు తెలిపింది. అతను చెప్పినా రహమాన్ వినలేదు. బాధితుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు రహమాన్‌పై కేసు నమోదు చేశారు. దీంతో రహమాన్ ఫయాజ్‌పై కక్ష పెంచుకున్నాడు.

ఆదివారం ఫయాజ్ తన కారు మరమ్మతుల కోసం మాసాబ్‌ట్యాంక్‌లోని చాచానెహ్రు పార్కు సమీపంలోని మెకానిక్ దుకాణానికి వచ్చాడు. రహమాన్ అక్కడకు వచ్చి ఫయాజ్‌ఫై ఒక్కసారిగా కత్తితో దాడిచేసి విచక్షణ రహితంగా పొడిచాడు. చుట్టుపక్కల వారు భయంతో పరుగులు పెట్టారు. బంధువులు ఫయాజ్‌ను బంజారాహిల్స్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.

 సినిమాల్లో విలన్...
 కాగా అబ్దుల్ రహమాన్ అలియాస్ బాబా పలు తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఇన్‌స్పెక్టర్ రవీందర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement