సీఎం జగన్‌ ఆకాంక్ష అదే: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy Wishes On CM YS Jagan Birthday Celebrations At Vizag - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అధికార వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ది చెందుతాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ పరిపాలనా రాజధానిగా ప్రకటించబడితే చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా రాష్ట్రమంతా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షిస్తున్నారన్నారు. శనివారమిక్కడ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో సీఎం జగన్‌ జన్మదిన వేడుకలను నిర్వహించారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి... భారీ కేక్‌ కట్‌చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గత ఆరు నెలలలో మంచి పరిపాలన అందించారని హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌ వ్యక్తిత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేసిందని... అయితే ఆయన ఎంత మృదు స్వభావో.. ఎంత మంచి వ్యక్తో ప్రజలు దగ్గరగా చూశారన్నారు. రాష్ట్రానికి 30 ఏళ్లపాటు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగాలని విజయసాయిరెడ్డి ఆకాంక్షించారు. ఇక సీఎం జగన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ నాయకులు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్‌, సిటీ అధ్యక్షుడు కృష్ణశ్రీనివాస యాదవ్‌, మల్లా విజయప్రసాద్‌, అక్కరమాని విజయనిర్మల, కెకె రాజు, కోలా గురువులు, వరుదు కళ్యాణి, గరికిన గౌరి, రొంగల జగన్నాథం, కొయ్యా ప్రసాదరెడ్డి, ఫక్కి దివాకర్‌, జాన్‌ వెస్లీ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top