కేఎల్‌ఎం అంబాసిడర్‌ కావడం ఆనందదాయకం | Vijay Devarakonda Visit KLM Shopping Mall in Rajamahendravaram | Sakshi
Sakshi News home page

కేఎల్‌ఎం అంబాసిడర్‌ కావడం ఆనందదాయకం

Dec 22 2018 12:06 PM | Updated on Dec 22 2018 12:06 PM

Vijay Devarakonda Visit KLM Shopping Mall in Rajamahendravaram - Sakshi

విలేకరులతో మాట్లాడుతున్న హీరో విజయ్‌ దేవరకొండ

తూర్పుగోదావరి, దానవాయిపేట (రాజమహేంద్రవరం): సినీ హీరో విజయ్‌ దేవరకొండ శుక్రవారం నగరంలో హల్‌చల్‌ చేశారు. స్థానిక జేఎన్‌ రోడ్డు రామాలయం సెంటర్‌లో ఉన్న కేఎల్‌ఎం షాపింగ్‌ మాల్‌లో ఫెస్టివ్‌ ఆఫర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేఎల్‌ఎం సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉందన్నారు. కేఎల్‌ఎం అనతి కాలంలోనే 15 శాఖలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విజయ్‌ దేవరకొండను చూసేందుకు పిల్లలు, పెద్దలు ఆసక్తి చూపారు. ముఖ్యంగా యువతీ యువకులు ఆయనను చూసేందుకు ఎగబడడంతో డా ప్రాంతం సందడిగా మారింది. ఆఫర్ల ప్రారంభ కార్యక్రమంలో సంస్థ సీఈవోలు రాజేష్, కళ్యాణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement