అక్రమ గ్రానైట్ తవ్వకాలను అడ్డుకున్న విజిలెన్స్ అధికారులు | Vigilance officials raid on Illegal granite quarrying | Sakshi
Sakshi News home page

అక్రమ గ్రానైట్ తవ్వకాలను అడ్డుకున్న విజిలెన్స్ అధికారులు

May 8 2015 6:20 PM | Updated on Sep 3 2017 1:40 AM

అనధికారికంగా గ్రానైట్ తవ్వకాలకు పాల్పడుతున్న క్వారీపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు.

గోరెంట్ల(అనంతపురం జిల్లా): అనధికారికంగా గ్రానైట్ తవ్వకాలకు పాల్పడుతున్న క్వారీపై విజిలెన్స్ అధికారులు శుక్రవారం దాడులు జరిపారు. అనంతపురం జిల్లా గోరెంట్ల మండలంలోని కమ్మలవాండ్లపల్లి గుట్ట వద్ద ఈ దాడులు జరిగాయి. అనధికారికంగా గ్రానైట్ తవ్వకాలు జరుపుతున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో క్వారీపై దాడి చేసి దానిని సీజ్ చేశారు. ఇటాచీ, క్రేన్, కంప్రెషనర్‌లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement