వినూత్న ఆలోచనలకు వేదిక మోహన మంత్ర

Vidyanikethan Institutions CEO MAnchu Vishnu Started Mohan Mantra For Students - Sakshi

సాక్షి, చంద్రగిరి(చిత్తూరు) : విద్యార్థుల్లోని వినూత్న ఆలోచనలకు పదును పెట్టేందుకు వేదికగా మోహన మంత్ర–19 నిలుస్తోందని శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల సీఈఓ, సినీ నటుడు మంచు విష్ణు అన్నారు. శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల్లో శుక్రవారం మోహన మంత్ర–19 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడమే ముఖ్య ఉద్దేశంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాంకేతిక, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో ఉత్సాహంతో పాటు వినూత్న ఆలోచనలు ఆవిష్కృతమవుతాయన్నారు. ఏడు సంవత్సరాల నుంచి ఏటా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు విజయవంతం చేస్తున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా సుమారు 30 వేల మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. 

ఉత్సాహంగా ... ఉల్లాసంగా .. 
తొలిరోజు మోహన మంత్ర కార్యక్రమం ఉత్సాహంగా..ఉల్లాసంగా సాగింది. విద్యార్థులతో ఉల్లాసంగా సాగింది. విద్యార్థులు టెక్నో హాలిక్‌ విభాగంలో ప్రదర్శించిన రోబో వార్‌ చూపరులను ఆకట్టుకుంది. కబడ్డీ, గల్లీ క్రికెట్, షార్ట్‌ ఫిలిమ్స్‌ విభాగంలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు అబ్బురపరిచా యి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top