పోస్ట్.. పోస్ట్ | very demand for speed post | Sakshi
Sakshi News home page

పోస్ట్.. పోస్ట్

Jan 19 2014 5:10 AM | Updated on Aug 29 2018 7:09 PM

తంతి తపాలాశాఖలో మళ్లీ పూర్వవైభవం కనిపిస్తోంది. కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల పుణ్యమా అని ఒక్కసారిగా దాదాపు కనుమరుగైన తపాలా సేవలు ఇప్పుడు కొంతమేరకు పుంజుకున్నారుు.

 గుడ్లవల్లేరు, న్యూస్‌లైన్ : తంతి తపాలాశాఖలో మళ్లీ పూర్వవైభవం కనిపిస్తోంది. కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల పుణ్యమా అని ఒక్కసారిగా దాదాపు కనుమరుగైన తపాలా సేవలు ఇప్పుడు కొంతమేరకు పుంజుకున్నారుు. ఈ సేవలపై గ్రామాల్లోని ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు సరికొత్త పద్ధతులు అందుబాటులోకి తీసుకురావడంతో సంస్థ వ్యాపార సంబంధాలు ఇటీవల బాగానే పెరిగారుు.

 స్పీడ్‌పోస్టులకు భలే డిమాండ్
 సాంకేతిక విప్లవం రావటంతో స్పీడ్ పోస్టులు బాగా వాడుకలోకి వచ్చాయి. స్పీడ్‌పోస్టు దేశంలో ఏ మూలకైనా నిమిషాల్లో వెళ్లే పరిజ్ఞానం రావడంతో చాలామంది వీటిపై ఆధారపడుతున్నారు. స్పీడుపోస్టు ఎప్పుడు, ఎక్కడికి వెళ్లింది.. ప్రస్తుతం ఎక్కడుంది వంటి విషయూలను అధికారులు ఆన్‌లైన్‌లో చూసి చెప్పేస్తున్నారు.

 తక్కువ కమీషన్‌తో మనియూర్డరు
 గతంలో మనియార్డరు చేయాలంటే నూటికి ఐదు రూపాయల కమీషన్ తీసుకునేవారు. ఇందుకు రోజులు, వారాలు పట్టేది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ మనియార్డరు, ఇన్‌స్టెంట్ మనియార్డర్లు అందుబాటులోకి వచ్చారుు. దేశంలో ఎక్కడికైనా నిమిషాల్లో పంపించే సాంకేతిక పరిజ్ఞానం పోస్టల్‌కు అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.50వేలకు కేవలం రూ.

120 కమీషన్‌తో ఇన్‌స్టెంట్ మనియార్డరు వెళ్లిపోతోంది. వీటితో పాటు బిజినెస్ పోస్ట్, ఎక్స్‌ప్రెస్ పార్శిల్, అడ్వర్‌టైజ్‌మెంట్ పోస్ట్, గ్రీటింగ్ పోస్ట్, సామాన్ల భట్వాడా పోస్టు, లాజిస్టిక్ పోస్టుతో పాటు వ్యాపార సేవలకు అనువైన సంస్థగా తపాలా శాఖ మారిపోరుుంది. తక్కువ ప్రీమియం-ఎక్కువ బోనస్ ‘పీఎల్‌ఐ’ 1884లో ప్రవేశపెట్టిన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్‌ఐ)కు ఇప్పుడు డిమాండ్ పెరిగింది.
 ఈ విధానం 1995లో గ్రామాల్లోనూ అందుబాటులోకి వచ్చింది.

 ఆ తరువాత జిల్లాలోని అవనిగడ్డ మండలాన్ని సంపూర్ణ పీఎల్‌ఐ మండలంగా ఇండియా పోస్టల్ గుర్తించింది. దీనిద్వారా ఏజెంట్ల పద్ధతి లేకుండా తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ కల్పించింది. ఇవికాక..
  మనీ ట్రాన్స్‌ఫర్ సేవల ద్వారా ప్రపంచ దేశాల నుంచి మారుమూల ప్రాంతాల ప్రజలకు లబ్ధి చేకూరుతోంది.
  విద్య, వ్యాపారం, వివాహాలకు రికరింగ్ డిపాజిట్లు ఎంతో ఉపయోగపడుతున్నారుు.
  రూ.50కే రోజువారీ లావాదేవీలకు పోస్టల్ ఖాతాను తెరిచే అవకాశం అమలులో ఉంది.
  అన్ని పోస్టాఫీసులు ఏటీఎంలు కూడా ఇస్తున్నారుు.

  సేవింగ్స్ ఖాతాలకు ప్రజాదరణ అధికమైంది.
  టీటీడీ నుంచి శ్రీవారి అక్షింతలతో ఆశీర్వచనాన్ని కూడా రూ.11కే అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement