వుడా ఇన్‌చార్జి వీసీగా శేషగిరిబాబు | VCD charge vuda sesagiribabu | Sakshi
Sakshi News home page

వుడా ఇన్‌చార్జి వీసీగా శేషగిరిబాబు

Sep 21 2014 2:07 AM | Updated on Sep 2 2017 1:41 PM

వుడా ఇన్‌చార్జి వీసీగా శేషగిరిబాబు

వుడా ఇన్‌చార్జి వీసీగా శేషగిరిబాబు

వుడా ఇన్‌చార్జి వీసీగా ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ చైర్మన్ ఎం.వి.శేషగిరిబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు...

విశాఖపట్నం : వుడా ఇన్‌చార్జి వీసీగా ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ చైర్మన్ ఎం.వి.శేషగిరిబాబు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు నిర్వహించిన జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో శేషగిరిబాబును నియిమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వుడా కార్యదర్శి జి.సి.కిశోర్‌కుమార్, చీఫ్ ఇంజినీర్ ఐ.విశ్వనాథరావు, చీఫ్ అర్బన్ ప్లానర్ ఆర్.జె.విద్యుల్లత, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ డి.విజయభారతి, డీఎఫ్‌వో బి.రాజారావు, ఎస్టేట్ అధికారి భవానీదాస్ తదితరులు శేషగిరిబాబుకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన అధికారులతో సమావేశమై వుడా కార్యకలాపాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement