ఎంపీపీ స్థానం కోసం సునీత బేరసారాలు | vasireddy padma fired on suneetha | Sakshi
Sakshi News home page

ఎంపీపీ స్థానం కోసం సునీత బేరసారాలు

Dec 15 2016 3:05 AM | Updated on Sep 4 2017 10:44 PM

ఎంపీపీ స్థానం కోసం సునీత బేరసారాలు

ఎంపీపీ స్థానం కోసం సునీత బేరసారాలు

అనంతపురం జిల్లా కనగాలపల్లి ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

బాబు బాటలోనే మంత్రులు..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ


సాక్షి, హైదరాబాద్‌: అనంతపురం జిల్లా కనగాలపల్లి ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపో యిన సీఎం చంద్రబాబు బాటలోనే మంత్రు లు, ఎమ్మెల్యేలు బేరసా రాలకు దిగుతున్నా రని మండిపడ్డారు. ఆమె బుధవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరులతో మాట్లాడుతూ.. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడి పదవులను కైవసం చేసుకోవడం టీడీపీకి సిద్ధాంతాల్లో భాగంగా మారిందని ధ్వజమెత్తారు. 

2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లా కనగానపల్లి ఎంపీపీ పదవిని టీడీపీ ప్రలోభాలతో లాక్కుకున్నారని, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ మంత్రి పరిటాల సునీత ప్రలోభాలకు పాల్పడటం సిగ్గు చేటని విమర్శించారు. ‘పోలవరం’కు సంబంధించి తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మంత్రి ఉమ అన్నారని పద్మ విమర్శించారు.  ప్రత్యేక హోదా తెస్తామంటే, పోలవరం కడుతుంటే జగన్‌ ఎలా అడ్డుపడుతున్నారో చెప్పాలన్నారు. దమ్ము, ధైర్యముంటే జగన్‌ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని సవాల్‌ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement