breaking news
mpp position
-
ఎంపీపీ స్థానం కోసం సునీత బేరసారాలు
• బాబు బాటలోనే మంత్రులు.. • వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లా కనగాలపల్లి ఎంపీపీ ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపో యిన సీఎం చంద్రబాబు బాటలోనే మంత్రు లు, ఎమ్మెల్యేలు బేరసా రాలకు దిగుతున్నా రని మండిపడ్డారు. ఆమె బుధవారం కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరులతో మాట్లాడుతూ.. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడి పదవులను కైవసం చేసుకోవడం టీడీపీకి సిద్ధాంతాల్లో భాగంగా మారిందని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో అనంతపురం జిల్లా కనగానపల్లి ఎంపీపీ పదవిని టీడీపీ ప్రలోభాలతో లాక్కుకున్నారని, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లోనూ మంత్రి పరిటాల సునీత ప్రలోభాలకు పాల్పడటం సిగ్గు చేటని విమర్శించారు. ‘పోలవరం’కు సంబంధించి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో మంత్రి ఉమ అన్నారని పద్మ విమర్శించారు. ప్రత్యేక హోదా తెస్తామంటే, పోలవరం కడుతుంటే జగన్ ఎలా అడ్డుపడుతున్నారో చెప్పాలన్నారు. దమ్ము, ధైర్యముంటే జగన్ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. -
విలక్షణ తీర్పు
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : మంచిర్యాల మున్సిపాలిటీలో 32 వార్డులుండగా 18 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు, 14 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ అందించారు. దీంతో చైర్మన్ పీఠం ఆ పార్టీ వశమైంది. ఇక ప్రాదేశిక ఎన్నికలకు సంబంధించి.. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే జెడ్పీటీసీగా గెలుపొందారు. మంచిర్యాల మండలంలో 31 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 16 ఎంపీటీసీ స్థానాలు టీఆర్ఎస్, 11 స్థానాలు కాంగ్రెస్, ఒకటి సీపీఐ, మూడు స్థానాలను స్వతంత్రులు కైవసం చేసుకున్నారు. మంచిర్యాల ఎంపీపీ స్థానం కైవసం చేసుకోవడానికి టీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ లభించింది. ఇక లక్సెట్టిపేట మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా.. టీఆర్ఎస్ పార్టీ 8, కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలుచుకున్నాయి. ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకే ఎంపీపీ పదవి దక్కనుంది. దండేపల్లి మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలుండగా టీఆర్ఎస్కు 7, కాంగ్రెస్‌కు 3, స్వతంత్రులు 4 స్థానాల్లో గెలుపొందారు. ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకే ఎంపీపీ పదవి దక్కనుంది. ఇరు శిబిరాల్లో.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌లో ఆనందం నింపగా.. ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ శిబిరంలో జోష్ నింపాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు స్పష్టమైన మెజార్టీ వస్తుందని టీఆర్ఎస్ నాయకులు భావిస్తుండగా.. స్థానిక ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు తేడా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. ఈ నెల 16న సార్వత్రిక ఎన్నికల లెక్కింపుతో ఎవరు గెలిచేది.. ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చేది తేలనుండడంతో స్థానికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.