ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే వాడా: రాజగోపాల్ | Used pepper spray in self defence, says lagadapati rajagopal | Sakshi
Sakshi News home page

ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే వాడా: రాజగోపాల్

Feb 13 2014 6:39 PM | Updated on Aug 18 2018 4:13 PM

ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే వాడా: రాజగోపాల్ - Sakshi

ఆత్మరక్షణ కోసమే పెప్పర్ స్ప్రే వాడా: రాజగోపాల్

తాను ఆత్మరక్షణ కోసం మాత్రమే పెప్పర్ స్ప్రేను ఉపయోగించానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు.

తాను ఆత్మరక్షణ కోసం మాత్రమే పెప్పర్ స్ప్రేను ఉపయోగించానని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓ ఎంపీపై సొంత పార్టీ వాళ్లతో పాటు ఇతరులు కూడా దాడి చేశారని, అప్పుడు మాత్రమే తాను వెల్ లోకి దూసుకెళ్లానని ఆయన తెలిపారు. మార్షల్స్ అదుపులోకి తీసుకుని, తిరిగి వదిలసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే కాక, ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా తమపై పాశవికంగా దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో తమ ప్రాణరక్షణ కోసం మాత్రమే తాను పెప్పర్ స్ప్రే ఉపయోగించానని, అంతేతప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కాదని రాజగోపాల్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement