కారులో గుర్తు తెలియని మృతదేహం | unknown person body in a car | Sakshi
Sakshi News home page

కారులో గుర్తు తెలియని మృతదేహం

Apr 17 2015 5:52 PM | Updated on Sep 3 2017 12:25 AM

కడప నగరం మద్రాస్ రోడ్డులోని చిన్నచౌక్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న కారులో ఒక మృతదేహం ఉండటంతో స్థానికులు కలవరపడ్డారు.

వైఎస్సార్ జిల్లా: కడప నగరం మద్రాస్ రోడ్డులోని చిన్నచౌక్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న కారులో ఒక మృతదేహం ఉండటంతో స్థానికులు కలవరపడ్డారు. శుక్రవారం ఉదయం నుంచి కారు అక్కడే ఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కర్ణాటక రాష్ట్రం రిజిస్ట్రేషన్ కెఎ 37ఎం-4758 నంబరుతో ఉన్న ఇండికా కారులో ఓ వ్యక్తి సీటులోనే చనిపోయి ఉన్నాడు. అతడు గీతల షర్టు ధరించి ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివారలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement