పతాక స్థారుుకి.. | united andhra movement swiped to delhi | Sakshi
Sakshi News home page

పతాక స్థారుుకి..

Aug 24 2013 4:37 AM | Updated on Sep 1 2017 10:03 PM

ప్రజా ఉద్యమం సంధించిన సమైక్య బాణం ఢిల్లీని తాకుతోంది. ఏఐసీసీ వర్గాలు సీమాంధ్ర ఉద్యమం పై ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్నాయి. చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, రైతులు, స్వచ్ఛం ద సంస్థలు, మహిళలు.. ప్రతి ఒక్క రూ సమైక్య నినాదంతో చేస్తున్న ఉద్యమం పతాక స్థారుుకి చేరింది. సామాన్యులు మొదలుపెట్టిన సమరం ఉన్నతాధికారులను, రాజకీయ పెద్దలను కదిలిస్తోంది.

 సాక్షి, ఏలూరు : ప్రజా ఉద్యమం సంధించిన సమైక్య బాణం ఢిల్లీని తాకుతోంది. ఏఐసీసీ వర్గాలు సీమాంధ్ర ఉద్యమం పై ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్నాయి. చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, రైతులు, స్వచ్ఛం ద సంస్థలు, మహిళలు.. ప్రతి ఒక్క రూ సమైక్య నినాదంతో చేస్తున్న ఉద్యమం పతాక స్థారుుకి చేరింది. సామాన్యులు మొదలుపెట్టిన సమరం ఉన్నతాధికారులను, రాజకీయ పెద్దలను కదిలిస్తోంది. ఏపీ ఎన్జీవోలు, ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు ఇప్పటికే సమ్మెలోకి వచ్చారు. ఇప్పటివరకూ మునిసిపాలిటీల్లో దిగువశ్రేణి ఉద్యోగులు మాత్రమే సమ్మె చేస్తుండగా ఈ నెల 26 నుంచి ప్రత్యక్ష ఆందోళనల్లోకి మునిసిపల్ కమిషనర్లు రానున్నారు.
 
 సెప్టెంబర్  2నుంచి పౌరసరఫరాల సంస్థలోని కిందిస్థాయి సిబ్బందితోపాటు ఉన్నత స్థాయి ఉద్యోగులు సైతం నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. ఈ విషయూన్ని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సలీంఖాన్ శుక్రవారం వెల్లడించారు. ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఎల్‌వీ సాగర్ నేతృత్వంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్‌ఎస్ హరనాథ్, జేఏసీ నగర అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాసరావు, కార్యదర్శి కె.రమేష్‌కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.సతీష్ శని వారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వె ళ్లనున్నారు. జాతీయ పార్టీల ముఖ్యనేతలు ములాయం సింగ్‌యాదవ్, మాయావతి, ఫరూక్‌అబ్దుల్లా, మైత్రేయన్, సీతారాం ఏచూరితోపాటు తృణమూల్ కాంగ్రెస్ నేతలను ఈనెల 26, 27, 28 తేదీల్లో కలిసి సమైక్య వాణి వినిపించనున్నారు. ఇక్కడి ప్రజల ఆకాం క్షను పార్లమెంట్‌లో వినిపించాల్సిం దిగా వారిని కోరనున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిం చేందుకు ఈ నెల 27న సీమాంధ్రలోని 13 జిల్లాల విద్యార్థి జేఏసీ నాయకులు తాడేపల్లిగూడెంలో సమావే శం కానున్నారు.
 
 సమ్మెలోకి డెప్యూటీ కలెక్టర్లు
 ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా జిల్లాలోని డెప్యూటీ కలెక్టర్లు శుక్రవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి డెప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ సమ్మె నోటీసు ఇచ్చింది. జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరావుతోపాటు ఆర్డీవోలు, నీటి పారుదల ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు కలిపి మొత్తం 15 మంది సమ్మెబాట పట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement