intellegence
-
ట్రంప్, మునీర్ దోస్తీ.. అమెరికా నిఘా వర్గాల్లో టెన్షన్
గత కొన్ని రోజులుగా అమెరికా, పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ లేనంత స్నేహ బంధం కొనసాగుతోంది. పాక్ నేతలు అమెరికా వెళ్లడం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కావడం, ఈ క్రమంలో పాకిస్తాన్ నేతలపై ట్రంప్ ప్రశంసలు కురిపించడం చూశాం. ప్రత్యేకంగా పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్‌పై ట్రంప్ దోస్తీ చేయడం అమెరికా నిఘా వర్గాలను టెన్షన్‌కు గురి చేస్తోంది. మునీర్‌తో స్నేహమంటే అమెరికాను రెడ్ జోన్‌లోని నెట్టేయడమేనని నిఘా సంస్థలు చెబుతున్నాయి. అయితే, ఇంటెలిజెన్స్‌ను భయపెడుతున్న అంశాలను పరిశీలిస్తే..అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌పై కొత్త చర్చలు మొదలయ్యాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ ఆయనను ప్రియమైన ఫీల్డ్ మార్షల్ అని పిలిచారు. కానీ అమెరికా గూఢచార సంస్థలు, ప్రాంతీయ విశ్లేషకులు మాత్రం మునీర్‌కి ఇరాన్ సైనిక నాయకత్వంతో ఉన్న పాత పరిచయాలు ఒక రెడ్ అలర్ట్‌గా భావిస్తున్నారు.ఇరాన్‌తో సంబంధాలు..మునీర్ గతంలో ఇరాన్‌కి చెందిన ప్రముఖ సైనిక నాయకులు కుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసీమ్ సోలేమానీ, ఐఆర్జీసీ కమాండర్ హొసేన్ సలామీతో వ్యక్తిగత సంబంధాలు కలిగి ఉన్నారని పాకిస్తాన్ మాజీ జనరల్ అహ్మద్ సయీద్ వెల్లడించారు. అలాగే, ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)లోని ఉన్నత స్థాయి వ్యక్తులతో కూడా పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాలు అమెరికా విధాన నిర్ణేతల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.మధ్యవర్తిత్వం అవకాశమా? ప్రమాదమా?మునీర్ ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ద్వంద్వ సంబంధాలు ఒకవైపు అమెరికాకు ఉపయోగపడవచ్చు. మరోవైపు వ్యూహాత్మక ప్రమాదాలను కూడా తెచ్చిపెట్టి అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.చారిత్రక అనుమానాలు..అమెరికా విధాన వర్గాల్లో పాకిస్తాన్‌పై అనుమానం కొత్తది కాదు. ఆఫ్ఘనిస్థాన్ యుద్ధ సమయంలో అమెరికా సహాయం పొందుతూ, తాలిబాన్‌కి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమోక్రసీస్ (FDD) విశ్లేషకులు, ముఖ్యంగా బిల్ రోజ్జియో, పాకిస్తాన్ సైన్యం విశ్వసనీయతపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగించాలా, లేక గూఢచార సంస్థల హెచ్చరికలను పరిగణనలోకి తీసుకోవాలా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. మధ్యప్రాచ్యం, దక్షిణాసియా అంతటా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ విధాన అంచనాలలో మునీర్ ఒక ఉపయోగకరమైన దౌత్య వారధిగా నిలుస్తారా? లేక ఒక సంభావ్య వ్యూహాత్మక భారంగా పరిణమిస్తారా? అనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఇక, అమెరికా-పాకిస్తాన్ సంబంధాలు ఎప్పుడూ వ్యూహాత్మక అవసరాల ఆధారంగా మారుతూ రావడం కొసమెరుపు. -
పతాక స్థారుుకి..
సాక్షి, ఏలూరు : ప్రజా ఉద్యమం సంధించిన సమైక్య బాణం ఢిల్లీని తాకుతోంది. ఏఐసీసీ వర్గాలు సీమాంధ్ర ఉద్యమం పై ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్నాయి. చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, రైతులు, స్వచ్ఛం ద సంస్థలు, మహిళలు.. ప్రతి ఒక్క రూ సమైక్య నినాదంతో చేస్తున్న ఉద్యమం పతాక స్థారుుకి చేరింది. సామాన్యులు మొదలుపెట్టిన సమరం ఉన్నతాధికారులను, రాజకీయ పెద్దలను కదిలిస్తోంది. ఏపీ ఎన్జీవోలు, ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు ఇప్పటికే సమ్మెలోకి వచ్చారు. ఇప్పటివరకూ మునిసిపాలిటీల్లో దిగువశ్రేణి ఉద్యోగులు మాత్రమే సమ్మె చేస్తుండగా ఈ నెల 26 నుంచి ప్రత్యక్ష ఆందోళనల్లోకి మునిసిపల్ కమిషనర్లు రానున్నారు. సెప్టెంబర్ 2నుంచి పౌరసరఫరాల సంస్థలోని కిందిస్థాయి సిబ్బందితోపాటు ఉన్నత స్థాయి ఉద్యోగులు సైతం నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. ఈ విషయూన్ని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సలీంఖాన్ శుక్రవారం వెల్లడించారు. ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు ఎల్వీ సాగర్ నేతృత్వంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ హరనాథ్, జేఏసీ నగర అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాసరావు, కార్యదర్శి కె.రమేష్‌కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.సతీష్ శని వారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వె ళ్లనున్నారు. జాతీయ పార్టీల ముఖ్యనేతలు ములాయం సింగ్‌యాదవ్, మాయావతి, ఫరూక్‌అబ్దుల్లా, మైత్రేయన్, సీతారాం ఏచూరితోపాటు తృణమూల్ కాంగ్రెస్ నేతలను ఈనెల 26, 27, 28 తేదీల్లో కలిసి సమైక్య వాణి వినిపించనున్నారు. ఇక్కడి ప్రజల ఆకాం క్షను పార్లమెంట్లో వినిపించాల్సిం దిగా వారిని కోరనున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిం చేందుకు ఈ నెల 27న సీమాంధ్రలోని 13 జిల్లాల విద్యార్థి జేఏసీ నాయకులు తాడేపల్లిగూడెంలో సమావే శం కానున్నారు. సమ్మెలోకి డెప్యూటీ కలెక్టర్లు ఏలూరు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమానికి మద్దతుగా జిల్లాలోని డెప్యూటీ కలెక్టర్లు శుక్రవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి డెప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ సమ్మె నోటీసు ఇచ్చింది. జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరావుతోపాటు ఆర్డీవోలు, నీటి పారుదల ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు కలిపి మొత్తం 15 మంది సమ్మెబాట పట్టారు.


