రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరు కొనసాగుతోంది. నిరసనలో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరు కొనసాగుతోంది. నిరసనలో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. అన్ని మండల కేంద్రాల నుంచి వందలాది బైకుల్లో కార్యకర్తలు నియోజకవర్గ కేంద్రాలకు చేరుకుని సమైక్య ర్యాలీ చేపట్టారు. సమైక్య ప్రకటన వచ్చే వరకూ పోరును ఆపేది లేదని నినదించారు.
సాక్షి, కడప: ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’పై చర్చకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కడపలో జిల్లా కన్వీనర్ కొత్తమద్ది సురేష్‌బాబు, మాజీ మేయర్ పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, షేక్ బె పారీ అంజాద్‌బాషా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అంజాద్‌తోపాటు పార్టీ అధికారప్రతినిధి అప్జల్‌ఖాన్, హఫీజుల్లా, మాసీమ బాబు వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ ప్రారంభించారు. నేతలంతా బైక్‌లను నడిపి సమైక్యనినాదాలు చేశారు. కార్యకర్తలు జెండాలు చేతపట్టుకుని నినదించారు.
సమైక్య ప్రకటన చేసేవరకూ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నిరసనల పర్వానికి విరామం చెప్పే ప్రసక్తే లేదని జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు తేల్చి చెప్పారు. కేంద్రం విభజన ప్రక్రియను తక్షణమే ఆపాలని మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి డిమాండ్ చేశారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో పట్టణ కన్వీనర్ కోలా శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.
సమైక్య తీర్మాణం చేయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నా సీఎం, స్పీకర్ పట్టంచుకోవడం లేదని అమర్‌నాథరెడ్డి ఆరోపించారు. పులివెందులలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో వందలాది బైక్‌లతో ర్యాలీ చేపట్టారు. వైఎస్‌తో పాటు పొట్టి శ్రీరాములు విగ్రహానికి అవినాష్ పూలమాల వేశారు. ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నాయకుడు పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, సమైక్యరాష్ట్రం కోసం అసెంబ్లీలో తీర్మాణం చేయాలని వైఎస్ అవినాష్ డిమాండ్ చేశారు. మైదుకూరులో పార్టీ క్రమశిక్షణ కమిటీ సంఘం సభ్యుడు రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కడప-కర్నూలు, ప్రొద్దుటూరు-నెల్లూరు ప్రధాన రహదారులపై ర్యాలీ నిర్వహించారు. 70ఏళ్ల వయస్సులోనూ రఘురామిరెడ్డి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ స్కూటీ నడుపుతూ ర్యాలీలో పాల్గొనడం విశేషం.కేవలం రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకే విభజన అంశాన్ని తెరపైకి తెచ్చారని రఘురామిరెడ్డి విమర్శించారు. జమ్మలమడుగులో నియోజకవర్గ సమన్వయకర్త తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తనయుడు భూపేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. బద్వేలులో మునిసిపల్ మాజీ చైర్మన్ మునెయ్య, మాజీ ఎంపీపీ అంబవరం వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ చేపట్టారు. పోరుమామిళ్లలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నాగార్జునరెడ్డి, చిట్టాబ్రదర్స్ ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. ైరె ల్వేకోడూరులో డీసీసీబీ మాజీ చైర్మన్ కొల్లం బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కమలాపురంలో మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. ప్రొద్దుటూరులో పార్టీ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ చేపట్టారు.