నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని షార్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి సంచరించడం స్థానికంగా కలకలం రేపింది.
సూళ్లూరుపేట: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని షార్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి సంచరించడం స్థానికంగా కలకలం రేపింది. బుధవారం ఉదయం రెండవ లాంచ్‌ప్యాడ్ వద్ద సుమారు 25 ఏళ్ల వయసున్న వ్యక్తి సంచరిస్తుండగా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు. తన పేరు వెంకటేష్ అని అతడు పోలీసుల విచారణలో వెల్లడించినట్టు సమాచారం.
మతిస్థిమితం లేనివాడిగా భావిస్తున్నారు. తమిళనాడులోని వేలూరుకి చెందిన వ్యక్తి అని ప్రాథమికంగా తెలిసింది. కాగా, ఈ నెల 27న జీఎస్‌ఎల్‌వీ డీ 6 ప్రయోగం ఉన్న నేపథ్యంలో ఇలా ఓ వ్యక్తి పట్టుబడడం అధికారుల్లో అలజడి రేపింది.