కాసేపట్లో మండలి ముందుకు కీలక బిల్లులు

Ummareddy Venkateswarlu Comments On Yanamala Ramakrishnudu - Sakshi

సాక్షి, అమరావతి : మరి కొద్దిసేపట్లో వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. మండలిలో అవలంభించాల్సిన వ్యూహం గురించి వారితో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఇచ్చే అవకాశం లేదు. గతంలోనే రూల్ ప్రకారం జరగలేదని చైర్మన్ చెప్పారు. కేవలం విచక్షణ అధికారం ఉందనే సెలెక్ట్ కమిటీ పంపిస్తానని చెప్పారు. సభ అభిప్రాయం తీసుకోకుండానే వాయిదా వేసి వెళ్లిపోయారు. యనమల ఇష్టం వచ్చినట్లు రూల్స్ మార్చి చెబుతున్నారు. ఆయన చెప్పిందే రూల్స్ అన్నట్లు మాట్లాడుతున్నారు. యనమల వాదనలకు తలా తోక ఉండదు. పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓటింగ్ పెట్టి రిజెక్టు చేసినా నెలలో బిల్లులు పాస్ అయిపోతాయ’ని అన్నారు.

చదవండి : రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top