ఐ లవ్ యూ అంటూ ఉదయ్ కిరణ్ చివరి మెసేజ్ | uday kiran last massege sent hit wife vishita | Sakshi
Sakshi News home page

ఐ లవ్ యూ అంటూ ఉదయ్ కిరణ్ చివరి మెసేజ్

Jan 6 2014 9:25 AM | Updated on Sep 2 2017 2:21 AM

ఐ లవ్ యూ అంటూ ఉదయ్ కిరణ్ చివరి మెసేజ్

ఐ లవ్ యూ అంటూ ఉదయ్ కిరణ్ చివరి మెసేజ్

సినీనటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునే ముందు భార్య విషితకు 'ఐ లవ్ యూ టూ' అంటూ చివరి మెసేజ్ పంపినట్లు సమాచారం.

హైదరాబాద్ : సినీనటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకునే ముందు భార్య విషితకు 'ఐ లవ్ యూ టూ' అంటూ చివరి మెసేజ్ పంపినట్లు సమాచారం. ఇక ఆత్మహత్య సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ అతని నివాసానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. మృతదేహంపై  ఉరి వేసుకున్నట్లు గుర్తులు ఉన్నాయన్నారు.

ఘటనా స్థలంలో ఉదయ్ కిరణ్ సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.  ఉరి వేసుకున్న తాడుతో పాటు, కళ్లజోడు, స్లిప్పర్స్ స్వాధీనం చేసుకున్నట్లు క్లూస్ టీమ్ అధికారులు తెలిపారు. ఉదయ్ కిరణ్ తన భార్యకు ఐ లవ్ యూ టూ అంటూ మెసేజ్ను పంపించినట్లు తెలుస్తుందన్నారు. కాల్ డేటాను పరిశీలిస్తున్నామని, పోస్ట్మార్టం నివేదిక రావల్సి ఉందన్నారు.

మరోవైపు ఉదయ్ కిరణ్ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్ ఏసీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ తీవ్ర డిప్రెషన్లో ఉన్నాడని, నెలరోజులుగా పరిస్థితులు బాగోలేదంటూ విచారణలో వెల్లడి అయ్యిందన్నారు. కెరీర్ సరిగా లేనందున తనకు చనిపోవాలని ఉందంటూ పదే పదే ఉదయ్ అనేవాడిన భార్య విషిత చెప్పినట్లు ఏసీపీ తెలిపారు. అవకాశాలు రాకపోవటంతో నిరాశకు లోనయ్యేవాడని విషిత వెల్లడించిందన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియాకు తరలిస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement