గోదావరిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు | two students missing in godavari river | Sakshi
Sakshi News home page

గోదావరిలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు

Jan 3 2016 7:12 PM | Updated on Sep 3 2017 3:01 PM

పశ్చిమగోదావరి జిల్లా ఆదివారం విషాదం చోటుచేసుకుంది.

కొవ్వూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆదివారం విషాదం చోటుచేసుకుంది. కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. కొవ్వూరు చైతన్య స్కూల్లో పదో తరగతి చదివే నందిగామ్ జయదేవ్, జి.సుమంత్ ఆదివారం సాయంత్రం గోదావరి నదిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. స్థానికులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థుల గల్లంతుతో స్థానికంగా విషాదం నెలకుంది.

Advertisement
 
Advertisement
Advertisement