నకిలీ చెక్కులతో మోసాలకు పాల్పడుతున్నఇద్దరు అరెస్ట్ | Two people arrested in fake cheque transaction | Sakshi
Sakshi News home page

నకిలీ చెక్కులతో మోసాలకు పాల్పడుతున్నఇద్దరు అరెస్ట్

Nov 20 2013 11:23 AM | Updated on Aug 25 2018 5:33 PM

నగరంలోని జ్యూయలరీ షాపుల్లో పలు మోసాలకు పాల్పడుతున్న హరికృష్ణ, శ్రీనివాసులను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

నగరంలోని జ్యూయలరీ షాపుల్లో పలు మోసాలకు పాల్పడుతున్న హరికృష్ణ, శ్రీనివాసులను వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 80 తులాల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ చెక్కు బుక్కులు, క్రెడిట్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

జ్యూయలరీ షాపుల్లో బంగారం కొనుగోలు చేసి, అనంతరం నకిలీ చెక్కులతో జ్యూయలరీ షాపు యజమానులను బురిడి కొట్టిస్తున్నారు. దాంతో జ్యూయలరీ షాపు యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు నిఘా వేసి నిందితులను పట్టుకున్నారు. వారిని స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement